Ammarajyamlo cuddapah bidalu: ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలపై తుది నిర్ణయం రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డుదే: హైకోర్టు

  • ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ
  • కొంత మందిని కించపరుస్తున్నట్టు ఉందన్న కమిటీ
  • ఈ చిత్రంపై మేము జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. న్యాయస్థానంలో విచారణ ముగిసింది. ఈ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలని తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై తుది నిర్ణయం రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డుదే అని తెలిపింది.  

ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రిలిమినరీ కమిటీ సినిమా విడుదలకు అడ్డుచెప్పింది. కొంత మంది వ్యక్తులను కించపరుస్తున్నట్టు ఈ సినిమా ఉందని హైకోర్టుకు ప్రిలిమినరీ కమిటీ నివేదికలో పేర్కొంది.

కాగా, ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు తీసేశామని కోర్టుకు చిత్ర బృందం తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం అభ్యంతరకర సన్నివేశాలు తొలగించినట్టు ఎక్కడా లేదని, కేవలం మ్యూట్ లో మాత్రమే ఉంచారని, అలా చేస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది.

Ammarajyamlo cuddapah bidalu
High Court
Varma
  • Loading...

More Telugu News