Kamal Haasan: కమలహాసన్ కు టీషర్ట్ బహూకరించిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్

  • చెన్నై వచ్చిన డ్వేన్ బ్రావో
  • బిహైండ్ వుడ్స్ పురస్కారం అందుకున్న బ్రావో
  • విశ్రాంతి తీసుకుంటున్న కమల్ ను పరామర్శించిన విండీస్ క్రికెటర్

భారతదేశమన్నా, ఇక్కడి ప్రజలన్నా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడడం ద్వారా తమిళ ప్రజలకు ఎంతో దగ్గరైన ఈ కరీబియన్ ఆటగాడు తాజాగా అగ్ర కథానాయకుడు, రాజకీయవేత్త కమలహాసన్ ను కలిశాడు. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కమల్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బిహైండ్ వుడ్స్ ప్రదానం చేసిన గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇన్ స్పిరేషన్ మెడల్ అందుకునేందుకు చెన్నై వచ్చిన డ్వేన్ బ్రావో ఈ సందర్భంగా కమల్ ఇంటికి వెళ్లాడు. కమల్ ను కలిసి పరామర్శించిన బ్రావో తన సంతకంతో కూడిన ఓ టీషర్టు బహుకరించాడు. డీజే బ్రావో అని ప్రింట్ చేసిన ఆ టీషర్టును కమల్ సంతోషంగా స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kamal Haasan
Dwayne Bravo
West Indies
MNM
Tamilnadu
IPL
  • Loading...

More Telugu News