CAB: ఇతర దేశాల ముస్లింలకు మన దేశ పౌరసత్వం ఇవ్వాలా?: అమిత్ షా

  • ప్రపంచంలోని ముస్లింలందరినీ మన పౌరులుగా చేసుకుందామా?
  • ఇది సాధ్యమేనా?
  • ఇలా ఏ దేశమైనా చేస్తుందా?

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, పొరుగు దేశాలకు  చెందిన ఎవరికైనా మన దేశ పౌరసత్వం ఇవ్వాలని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లు ముస్లిం మెజారిటీ దేశాలని... వారి రాజ్యాంగంలోనే ఇస్లాం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఆ దేశాల్లోని ముస్లింలు ఇతర మతస్తుల మాదిరి ఎలాంటి మత వివక్షను ఎదుర్కోరని తెలిపారు.

'కొందరు ఏమంటున్నారు? వారు చెబుతున్నట్టుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ముస్లింలకు కూడా మనం పౌరసత్వం ఇవ్వాలా? ప్రపంచంలోని ముస్లింలందరినీ మన పౌరులుగా చేసుకుందామా? ఇది సాధ్యమేనా? ఏ దేశమైనా ఇలా చేస్తుందా?' అని అమిత్ షా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News