Mahesh Babu: 'ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌'లో మ‌హేశ్ బాబు జోరు

  • 'ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ 2019'లో తొమ్మిదో స్థానంలో మహేశ్ 
  • మహిళల జాబితాలో ఏడో స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌
  • వినోద రంగంలో అగ్రస్థానంలో అమితాబ్ బచ్చన్

'ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ 2019'లో తొమ్మిదో స్థానంలో నిలిచి సినీనటుడు మహేశ్ బాబు జోరు కొనసాగించాడు. తాజాగా ట్విట్టర్ ఇండియా ఈ వివరాలు వెల్లడించింది. బిగిల్ నిర్మాత అర్చ‌న క‌లాప‌తి నాలుగో స్థానంలో, హీరో విజ‌య్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక సినీ ద‌ర్శ‌కుడు అట్లీ ప‌ద‌వ స్థానంలో నిలిచాడు. మహిళల జాబితాలో హీరోయిన్ లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ఏడో స్థానంలో, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ప‌దో స్థానంలో ఉన్నారు.
 
వినోద రంగంలో పురుషుల విభాగంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉండగా, అక్ష‌య్, స‌ల్మాన్ ఆ త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక నటీమణుల విభాగంలో సోనాక్షి సిన్హా అగ్రస్థానంలో, అనుష్క శ‌ర్మ రెండో స్థానంలో నిలిచారు. కొన్ని రోజుల్లో 2020 సంవ‌త్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో 2019లో ట్విట్ట‌ర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న ప్ర‌ముఖుల పేర్ల‌ను ట్విట్టర్ ప్రకటిస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News