Chandrababu: చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి.. ఆయనపై చర్చ జరగాలి: అంబటి రాంబాబు

  • స్పీకర్ ను చంద్రబాబు విమర్శించడం దారుణం
  • చంద్రబాబుపై సభలో చర్చ జరగాలి
  • సభలో మర్యాద పాటించనందుకు చర్యలు తీసుకోవాలి

స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్పీకర్ కు సభ్యత లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Ambati Rambabu
Thammineni Seetharam
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News