Bhavani: తల్లిదండ్రులను గుర్తించేందుకు భవానీకి డీఎన్ఏ పరీక్షలు: విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

  • పన్నెండేళ్ల తరువాత తల్లి వద్దకు భవానీ
  • పెంచిన తల్లి అభ్యంతరాలతో డీఎన్ఏ పరీక్షలు
  • న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకేనన్న సీపీ  

దాదాపు 12 సంవత్సరాల తరువాత తల్లిదండ్రులను కలిసిన భవానీకి, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం, భవానీ తల్లిదండ్రులను గుర్తించినప్పటికీ, పెంపుడు తల్లి జయమ్మకు వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తామని పోలీసులు అంటున్నారు. త్వరలోనే పరీక్షలు చేయిస్తామని, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కాగా, తాను తల్లిదండ్రుల వద్దకు వెళతానని, పెంచిన తల్లి వద్దకు అప్పుడప్పుడూ వస్తుంటానని భవానీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Bhavani
DNA
Dwaraka Tirumala Rao
  • Loading...

More Telugu News