Disha: దిశ తండ్రిని రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు

  • ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దిశ తండ్రి
  • వారంలో ఐదు రోజులు అక్కడే ఉంటూ శని, ఆదివారాలు మాత్రమే ఇంటికి
  • బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న దిశ తండ్రిని రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1981-87 మధ్య భారత సైన్యంలో పనిచేసిన దిశ తండ్రి ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుమస్తాగా చేరి అసిస్టెంట్ స్థాయికి ఎదిగారు. వారంలో ఐదు రోజులు పనిచేసే ప్రాంతంలోనే ఉంటూ శని, ఆదివారాల్లో ఇంటికి వచ్చి వెళ్లేవారు.

దిశ హత్యచార ఘటన నేపథ్యంలో ఆయనను రాజేంద్రనగర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో పనిచేస్తున్న దిశ సోదరికి ఇకపై నైట్ షిఫ్ట్‌లు కాకుండా, పగటి విధులు కేటాయించాలని కోరనున్నట్టు ఆమె తండ్రి తెలిపారు.

Disha
father
rajendranagar
mahaboobnagar
  • Loading...

More Telugu News