Chandrababu: ఆ రోజునే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను: చంద్రబాబునాయుడు

  • లోకేశ్ పై అంబటి వ్యాఖ్యలకు బాబు ఘాటు స్పందన
  • మా అబ్బాయి గురించి మాట్లాడతారా?
  • జగన్ ని అమెరికా పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు

ఈరోజు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల తూటాలు పేలాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపైనే కాకుండా ఆయన కుమారుడు నారా లోకేశ్ పైనా వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై బాబు ఘాటుగా బదులిచ్చారు.

‘మా అబ్బాయి గురించి మాట్లాడారు.. ఈ అంబటి రాంబాబుకు తెలియదు, ఇదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి చర్చకు వస్తే చెప్పా.. మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు.. మా వాడు చదువుకుంటున్నాడు, గర్వపడుతున్నా’ అంటూ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.
 
‘మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లూ అంతే దూరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనుషులను రెచ్చగొట్టడం, మనోభావాలను దెబ్బతీయడం, అవమానం చేయడం మంచి పద్ధతి కాదు. వాళ్లు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే నేను కూడా పద్ధతి ప్రకారం గౌరవిస్తా. అంతేగానీ, వీళ్లు నన్ను అవమానం చేయాలనుకుంటే, అదేవిధంగా వాళ్లకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం వీళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News