Chandrababu: నేను సవాల్ విసిరితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడకుండా తప్పించుకున్నారు: చంద్రబాబునాయుడు

  • ‘వ్యవసాయం దండగ’ అని నేను అన్నట్టు ఆరోపించారు
  • ఈ వ్యాఖ్యలు నిరూపించాలని డిమాండ్ చేశా
  • నాటి సంఘటనను గుర్తుచేసిన చంద్రబాబు

‘వ్యవసాయం దండగ’ అని తాను అన్నట్టుగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ‘వ్యవసాయం దండగ’ అన్న వ్యాఖ్యలు తాను చేసినట్టు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేశారని, నిరూపించమని ఆయనకు సవాల్ విసిరితే  మాట్లాడకుండా తప్పించుకున్నారని గుర్తుచేసుకున్నారు. వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు.

Chandrababu
Ys Rajashekar reddy
YSRCP
mla`s
  • Loading...

More Telugu News