Polavaram: పోలవరంపై కేంద్రం పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోవాలి: పార్లమెంటులో తెలుగులో ప్రసంగించిన జీవీఎల్

  • రాష్ట్రం చెబుతున్నదానిపై మరింత స్పష్టత రావాలన్న జీవీఎల్
  • కేంద్రం మిగతా నిధులు కూడా విడుదల చేయాలని సూచన
  • నిర్వాసితుల అంశం పరిష్కరించాలని విజ్ఞప్తి

పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సభలో పోలవరం అంశాన్ని లేవనెత్తారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, ప్రాజెక్టుపై రూ.2375 కోట్ల అదనపు వ్యయం చెల్లింపులు చేశామని చెప్పిందని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.

 ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుని మిగతా నిధులు కూడా విడుదల చేసి ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కల సాకారం అయ్యేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి, నిర్వాసితుల అంశాన్ని కూడా పరిష్కరించాలని జీవీఎల్ కోరారు. కాగా సభలో జీవీఎల్ పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం విశేషంగా చెప్పాలి.

Polavaram
Rajya Sabha
GVL Narasimharao
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News