Chandrababu: స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి టీడీపీ వాకౌట్

  • స్పీకర్-చంద్రబాబు మధ్య మాటల యుద్ధం
  • విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న ఎమ్మెల్యే రామానాయుడు
  • ప్రజలను జగన్ అడుగడుగునా దగా చేశారన్న అచ్చెన్న

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాల్సిందిగా పట్టుబట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది పార్టీ ఆఫీసు కాదని మందలించారు. చంద్రబాబు కల్పించుకోవడంతో స్పీకర్, చంద్రబాబు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. చంద్రబాబుపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.  

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేస్తామన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజలను జగన్ అడుగడుగునా మోసం చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.  

Chandrababu
ap assembly
speaker
  • Loading...

More Telugu News