Chandrababu: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యుల ఆందోళన
- పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీడీపీ డిమాండ్
- ఇది పార్టీ కార్యాలయం కాదన్న స్పీకర్
- ఆ విషయం తమకు చెప్పాల్సిన పనిలేదన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పలు విషయాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగ్గా, నేడు సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని పట్టుబట్టారు.
టీడీపీ తీరుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ పార్టీ కార్యాలయం కాదని మండిపడ్డారు. స్పీకర్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంతే దీటుగా స్పందించారు. అసెంబ్లీలో ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదన్నారు. ఇది పార్టీ ఆఫీసు కాదన్న విషయం తమకు చెప్పాల్సిన పనిలేదన్నారు. మళ్లీ కల్పించుకున్న స్పీకర్ గతంలో మీరు ఏం చేశారో తమకు అన్నీ తెలుసని అన్నారు. దీంతో సభలో మళ్లీ గందరగోళం మొదలైంది.