Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లక్కీ ఛాన్స్ కొట్టిన కీర్తి సురేశ్
  • విజయ్ తో శంకర్ సినిమా 
  • వెబ్ సీరీస్ లో మాధురి దీక్షిత్

   *  'మహానటి' సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందే చిత్రంలో ఓ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయం గురించి కీర్తి చెబుతూ, 'చాలా హ్యాపీగా వుంది.. రజనీ సార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మరపురాని విషయం అవుతుంది' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
*  ప్రస్తుతం కమలహాసన్ తో 'భారతీయుడు'కి సీక్వెల్ రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రాన్ని మరో స్టార్ హీరో విజయ్ తో చేయనున్నాడు. ఈ విషయంలో విజయ్ తో ఇటీవల మాట్లాడాననీ, సానుకూల స్పందన వచ్చిందనీ శంకర్ చెప్పారు.
*  చాలా మంది తారల్లాగానే ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కూడా డిజిటల్ ప్రపంచంలోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మించే వెబ్ సీరీస్ లో మాధురి నటించనుంది. వినోద రంగంలో పనిచేసే ప్రముఖుల జీవితాల ఆధారంగా ఈ సీరీస్ నిర్మితం అవుతుంది.

Keerthi Suresh
Rajanikanth
Shankar
Vijay
Madhuri Dixith
  • Loading...

More Telugu News