Andhra Pradesh: ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పునర్నియామకం
- సీఎం జగన్ అధ్యక్షతన బోర్డు
- బోర్డులో 9 మంది మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్థానం
- ఇటీవల ఏపీ నుంచి వెనక్కి వెళ్లిపోతున్న పరిశ్రమలు!
ఇటీవల కొన్ని పరిశ్రమలు ఏపీ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బోర్డుకు సీఎం జగన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు. వారిలో 9 మంది మంత్రులు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా స్థానం కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి సిఫారసులు, నిర్ణయాలు తీసుకోవడం ఈ బోర్డు విధి.