Amma rajyamlo kadapa Biddalu: మార్ఫింగ్ ఫొటో ఎఫెక్ట్.. రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు కేఏ పాల్ కోడలు ఫిర్యాదు

  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి దిగిన ఫొటో మార్ఫింగ్
  • వర్మపై చర్యలు తీసుకోవాలి.. మార్ఫింగ్ ఫొటోను తొలగించాలి
  • సైబర్ క్రైమ్ పోలీసులకు పాల్ కోడలు జ్యోతి ఫిర్యాదు

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ప్రమోషన్ లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఈ ఫొటోను వర్మ వాడుకున్నారని ఆరోపిస్తూ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి తాము దిగిన ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి, వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా మార్చారని పేర్కొన్నారు. వర్మ తన ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోను తొలగించాలని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వర్మపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటో మార్ఫింగ్ చేసి పోస్టు చేసిన వర్మ ఐపీ నెంబర్ కోసం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం.

Amma rajyamlo kadapa Biddalu
Varma
Ka pal
Begal jyothy
cyber crime police
complaint
  • Loading...

More Telugu News