Andhra Pradesh: ఏపీలో ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద తోపులాట!

  • ఉల్లిపాయల కోసం క్యూ లైన్లలో బారులు తీరిన ప్రజలు
  • సత్తెనపల్లి, పొన్నూరులోని రైతుబజార్లలో తోపులాట
  • తాత్కాలికంగా ఉల్లి విక్రయాల నిలిపివేత

ఏపీలో ఉల్లిపాయల కోసం క్యూ లైన్లలో ప్రజలు బారులు తీరారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పొన్నూరులోని రైతుబజార్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వారి మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో, పొన్నూరు రైతుబజార్ లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి. సత్తెనపల్లి రైతుబజార్ లో మహిళల మధ్య తోపులాట కారణంగా ఉల్లి విక్రయాలను మార్కెటింగ్ సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. కృష్ణా జిల్లాలోని మైలవరంలోనూ ఇదే పరిస్థితి. పోలీసుల ప్రమేయంతో పరిస్థితి చక్కబడింది. కాగా, విజయవాడలోని ఉల్లి విక్రయ కేంద్రాలను టీడీపీ నేతలు పరిశీలించారు. స్థానిక స్వరాజ్ మైదాన్ లోని రైతుబజార్ కు దేవినేని ఉమ, బోడె ప్రసాద్, బోండా ఉమ వెళ్లారు. ప్రజలను పలుకరించారు.

Andhra Pradesh
Sattenapalli
ponnur
Telugudesam
  • Loading...

More Telugu News