Guntur District: గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ పట్టివేత

  • ఓ అపార్ట్ మెంట్ వద్ద అనుమానాస్పద సంచారం
  • పోలీసుల అదుపులో ముగ్గురు గుజరాతీలు
  • నరసరావుపేటలోనూ చోరీలకు పాల్పడినట్టు అనుమానం

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చడ్డీ గ్యాంగ్ పేరు తరచుగా వినిపిస్తోంది. ప్రత్యేక ఆహార్యంతో దొంగతనాలకు బయల్దేరే ఈ ఉత్తరాది ముఠా దారుణాలకు సైతం వెనుకాడదని ప్రచారంలో ఉంది. తాజాగా, గుంటూరు జిల్లా వినుకొండలో చడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల అదుపులో ఉన్న ఆ ముగ్గురు గుజరాత్ కు చెందిన జశ్వంత్ భాయ్, తారా సింగ్, సబూర్ భాయ్ గా గుర్తించారు. వినుకొండలోని శివసాయి అపార్ట్ మెంట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్టోబరు 23న కూడా ఇదే అపార్ట్ మెంట్ వద్ద కలియదిరిగినట్టు గుర్తించారు. నిందితులు నరసరావుపేటలో కూడా పలు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Guntur District
Vinukonda
Cheddy Gang
Police
Narasaraopet
  • Loading...

More Telugu News