Andhra Pradesh: ఏపీలో మాదిరి తెలంగాణలోనూ సబ్సిడీపై ఉల్లిపాయలు అందించాలి: వీహెచ్

  • దేశంలో ఉల్లి ధరలు పెరిగిపోయాయి
  • తెలంగాణలో ఉల్లి ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
  • ఢిల్లీలో మీడియాతో టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

ఏపీలో మాదిరి తెలంగాణలోనూ సబ్సిడీపై ఉల్లిపాయలు అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయని, తెలంగాణలో వీటి ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో టీ-కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, నేరం చేయాలంటే భయపడేలా చట్టాల్లో మార్పులు తేవాలని కోరారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన నుంచి సీఎం కేసీఆర్ బయటకు రావాలని కోరారు.

Andhra Pradesh
Telangana
congress
VH
Onion
  • Loading...

More Telugu News