akshaya patra: అక్షయ పాత్ర ఫౌండేషన్ కు రూ.కోటి విరాళమిచ్చిన 'సిల్వర్ ఓక్స్' విద్యా సంస్థల అధినేత

  • చెక్కును అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్ కు అందజేత
  • నిరుపేద విద్యార్థుల ఆకలిని తీర్చుతోన్న అక్షయపాత్ర
  • పెద్ద మనసు చాటుకుంటోన్న ప్రముఖులు

నిరుపేద విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు భోజనం అందిస్తోన్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థకు హైదరాబాదు శివారు బాచుపల్లి సిల్వర్ ఓక్స్ విద్యా సంస్థల అధినేత ధనుంజయ ఈ రోజు రూ.కోటి విరాళమిచ్చారు. చెక్కును అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్ కు అందజేశారు.

 కాగా, దాతల అండతో అక్షయపాత్ర సేవలను నిర్వాహకులు దేశంలోని పలు నగరాలకు విస్తరించారు. ప్రతి రోజు అక్షయపాత్ర ద్వారా లక్షలాది మంది ఆకలి తీరుతోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన అక్షయపాత్ర సేవలు ఇప్పుడు పలు రాష్ట్రాలకు విస్తరించాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్వహిస్తున్న అక్షయపాత్ర మధ్యాహ్న భోజన కార్యక్రమానికి ప్రముఖులు భారీ విరాళాలను ఇస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

akshaya patra
Hyderabad
  • Loading...

More Telugu News