onion: ఉల్లిధరల పెరుగుదలపై చంద్రబాబు, లోకేశ్ నిరసన

  • ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయి
  • టీడీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు
  • ఉల్లి ధరలు దిగివచ్చేవరకు మా పార్టీ పోరాడుతుంది

ఉల్లిధరల పెరుగుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఈ రోజు ఉదయం సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ఓ తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమే అని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో సబ్సిడీపై తక్కువ ధరలకే సరుకులు అందించామని తెలిపారు. ఉల్లి ధరలు దిగివచ్చేవరకు తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. ఉల్లి ధరలను ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని అన్నారు. నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

onion
Chandrababu
Nara Lokesh
  • Loading...

More Telugu News