Unnao: ఉన్నావో హత్యాచార కేసు.. ఏడుగురు పోలీసులపై వేటు!

  • కోర్టుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని అడ్డుకుని నిప్పు
  • ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు
  • హౌస్ ఆఫీసర్, ఆరుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ఉన్నావో అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు పోలీసులపై యోగి ప్రభుత్వం వేటేసింది. రాయబరేలీ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలిని అడ్డుకుని దాడిచేసిన నిందితులు.. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన బాధితురాలు శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచింది.

ఈ మొత్తం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులపై ప్రభుత్వం వేటేసింది. ఉన్నావో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ  విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు  లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.

Unnao
rape case
police
Uttar Pradesh
  • Loading...

More Telugu News