Chandrababu: చంద్రబాబు మోసం చేస్తారని పార్థసారథి ముందే హెచ్చరించారు: దేవినేని అవినాశ్

  • నా రాజకీయ భవిష్యత్ కోసం పార్థసారథి సూచనలు చేశారు
  • పెనమలూరును బోడె ప్రసాద్ గాలికొదిలేశారు
  • నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేస్తా

చంద్రబాబునాయుడు మోసం చేస్తారని వైసీపీ నేత పార్థసారథి ముందు నుంచీ తనను హెచ్చరిస్తూనే ఉన్నారని ఇటీవల వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా తన రాజకీయ భవిష్యత్ కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాశ్ గుర్తు చేసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్‌ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నియోజకవర్గ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి నేతలతో కలిసి పనిచేస్తానని అవినాశ్ పేర్కొన్నారు.

Chandrababu
devineni avinash
penamaluru
  • Loading...

More Telugu News