Visakhapatnam: నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అబద్ధం: టీడీపీ ఎమ్మెల్యే గణబాబు

  • వదంతులు ప్రచారం చేస్తున్నారు
  • ఊహాజనిత వార్తలు రాస్తున్నారు
  • సుజనా చౌదరితో టచ్ లో ఉన్నానన్నది అబద్ధం

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే గణబాబు స్పష్టత నిచ్చారు. ఈ విషయమై వదంతులు ప్రచారం చేస్తున్నారని, ఊహాజనిత వార్తలు రాస్తున్నారని అన్నారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి   విశాఖపట్టణంలో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీల నేతలు వెళ్లారని, అయితే, టీడీపీ నేతలే కిషన్ రెడ్డిని కలిశారంటూ మీడియాలో ప్రచారం చేశారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో తాను టచ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అబద్ధమని చెప్పారు.

Visakhapatnam
Telugudesam
mla
Ganababu
  • Loading...

More Telugu News