ala Vaikunthapuramulo: నేడు రావాల్సిన 'అల వైకుంఠపురములో' టీజర్ రావట్లేదట!

- మరణించిన మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్ బాయ్
- తమ ఇంటి సభ్యుడు మరణించాడన్న గీతా ఆర్ట్స్
- టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
మెగా హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' టీజర్ నేడు విడుదల అవుతుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు పాటలకు మంచి స్పందన రాగా, అవన్నీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయన్న సంగతి తెలిసిందే. నేటి టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ భాయ్ అకస్మాత్తుగా మరణించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
