CPI Narayana: ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ యూటర్న్‌: పార్టీ ఇటువంటి వాటికి వ్యతిరేకం

  • నాది వ్యక్తిగత అభిప్రాయం
  • పార్టీ నిర్ణయం మేరకు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా
  • పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడలేం

హైదరాబాద్‌లో దిశ హత్యోదంతం నిందితుల ఎన్‌కౌంటర్‌ను తొలుత సమర్థించిన సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణ యూటర్న్‌ తీసుకున్నారు. అప్పట్లో అది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఎన్‌కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం కావున నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఈ రోజు ప్రకటించారు. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే సమయంలో తన వ్యాఖ్యల విషయంలో పార్టీకి, ప్రజా సంఘాలకు క్షమాపణలు కూడా తెలియజేస్తున్నాను’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

CPI Narayana
justice for disa
encounter
u turn on coments
  • Loading...

More Telugu News