Earth Quake: ఉత్తరాఖండ్ లో భూకంపం... ఆందోళనతో ప్రజల పరుగులు!

  • చమోలీ కేంద్రంగా భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 3.2 శాతం తీవ్రత
  • ఈ నెలలో మూడోసారి భూకంపం

ఉత్తరాఖండ్‌ లోని చమోలీ కేంద్రంగా ఈ తెల్లవారుజామున భూమి కంపించింది.  రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.2 గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూమి లోపల భూకంప కేంద్రం ఉందని, దీని ప్రభావం సుమారు పది కిలోమీటర్ల వరకూ కనిపించిందని అన్నారు.

భూమి కంపిస్తుండటంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ నెలలో ఇదే ప్రాంతంలో భూమి కంపించడం ఇది మూడవ సారి కావడంతో ప్రజలు భయపడుతున్నారు. కాగా, ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు సమాచారం అందలేదని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Earth Quake
Uttarakhand
Chamoli
  • Loading...

More Telugu News