Hyderabad: కూతురిని లైంగికంగా వేధించినందుకు ఆరేళ్ల జైలుశిక్ష!

  • హైదరాబాద్ మంగళ్ హాట్ ప్రాంతంలో ఘటన
  • తండ్రి వేధింపులు భరించలేక తల్లికి చెప్పుకున్న బాలిక
  • పక్కా సాక్ష్యాలతో కోర్టుకు వచ్చిన కేసు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డను లైంగికంగా వేధించిన ఓ క్రూరుడికి హైదరాబాద్ స్పెషల్ సెషన్స్ కోర్టు ఆరేళ్ల జైలుశిక్షను విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, నగరంలోని మంగళ్ హాట్ ప్రాంతంలో నివాసమున్న వ్యక్తికి, 15 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యతో మనస్ఫర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఇంటర్ చదువుతున్న కుమార్తె తండ్రి ఇంటికి వచ్చిపోతూ ఉండేది. ఈ క్రమంలో ఆమెతో అతను అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.

తండ్రి వేధింపులు భరించలేని బాలిక, తల్లికి విషయం చెప్పగా, ఆమె ఫిర్యాదుతో ఆగస్టు 2017లో పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులపై పక్కా సాక్ష్యాలను సంపాదించి, నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం, ఆరేళ్ల జైలుశిక్ష, రూ. 1000 జరిమానా విధించింది.

Hyderabad
Daughter
Court
Sentence
Jail Term
  • Loading...

More Telugu News