Anantapur District: విద్యార్థినిని వేధిస్తున్న ఆటో డ్రైవర్‌ను కటకటాల వెనక్కి పంపిన ధర్మవరం పోలీసులు

  • కళాశాలకు వెళ్తున్న విద్యార్థినికి వేధింపులు
  • దేహశుద్ధి చేసిన స్థానిక ఆటో డ్రైవర్లు
  • కేసు పెట్టి అంతుచూస్తానని విద్యార్థినికి బెదిరింపు

విద్యార్థినిని వేధించడమే కాకుండా అంతుచూస్తానని బెదిరించిన ఆటో డ్రైవర్‌కు అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బత్తలపల్లి మండలం అప్రాచెరువు గ్రామానికి చెందిన విద్యార్థిని ధర్మవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో బత్తలపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు.

నిన్న కూడా ఆమెను వేధించడంతో చూసిన స్థానిక ఆటో డ్రైవర్లు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపారు. అతడిపై కేసు పెడతానంటూ విద్యార్థిని వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్ బత్తలపల్లిలో ఆమెను అడ్డుకుని కేసు పెట్టి అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధిత విద్యార్థిని ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బత్తలపల్లి ఆటోస్టాండ్‌లో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur District
student
auto driver
  • Loading...

More Telugu News