Disha: దిశ నిందితుల మృతదేహాలను పరిశీలించిన ఎన్ హెచ్ఆర్సీ బృందం

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎన్ హెచ్ఆర్సీ బృందం
  • ఎన్ కౌంటర్ ఘటన స్థలంలో పరిశీలన

తెలంగాణలోని చటాన్ పల్లి వద్ద దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) రంగంలోకి దిగింది. ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికలను కూడా పరిశీలించారు. ఎన్ హెచ్ఆర్సీ బృందం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Disha
Hyderabad
Telangana
Encounter
NHRC
  • Loading...

More Telugu News