kanna laxminarayana: హైదరాబాద్ ఐటీ గ్రిడ్ చీఫ్ ను వెంటనే అరెస్టు చేయాలి: జగన్ కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

  • మార్చిలో  ఏపీ ఓటర్లకు చెందిన సమాచారం చోరీ
  • ప్రధాన సూత్రధారి, ఐటీ గ్రిడ్ చీఫ్ అశోక్ ను అరెస్టు చేయలేదు
  • ఎందుకింత అలక్ష్యం?

కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమయిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిందని అప్పట్లో వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ విషయంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. మార్చిలో హైదరాబాద్ ఐటీ గ్రిడ్ లో ఏపీ ఓటర్లకు చెందిన సమాచారం చోరీకి గురైందని, యూఐడీఏఐ సైతం 7.8 కోట్ల మంది ఓటర్ల సమాచారం చోరీకి గురైందని ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఓటర్ల ఆధార్, ఎన్నికల గుర్తింపు సంఖ్య వంటి సమాచారం చోరీకి గురైనట్లు ఇప్పటికే వెల్లడైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధాన సూత్రధారి ఐటీ గ్రిడ్ చీఫ్ అశోక్ ను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ చీఫ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

kanna laxminarayana
Andhra Pradesh
Jagan
  • Loading...

More Telugu News