MS Dhoni: కేవలం కృతజ్ఞతలు చెప్పి ధోనీకి వీడ్కోలు పలకలేం: గంగూలీ

  • ధోనీ రిటైర్మెంట్ పై ఎడతెగని చర్చ
  • స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
  • ధోనీకి ఏమిస్తే సరిపోతుందని వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహారం బీసీసీఐని ఇబ్బందులకు గురిచేస్తోంది. అటు ధోనీ నుంచి రిటైర్మెంట్ వార్త రాకపోవడం, ఇటు సెలెక్టర్లు ధోనీ లేకుండానే జట్టును ఎంపిక చేస్తుండడం తెలిసిందే. దాంతో, ధోనీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ మీడియా వర్గాలు బీసీసీఐని ప్రశ్నిస్తున్నాయి.

 దీనిపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలు అసామాన్యం అని, అలాంటి గొప్ప క్రికెటర్ కు కేవలం కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలకలేమని వ్యాఖ్యానించారు. టీమిండియాకు ధోనీ అందించిన ఘనతల పట్ల అతనికి ఏమిస్తే సరిపోతుంది? అన్నారు గంగూలీ.

రిటైర్మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేద్దామని, భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన లెజెండరీ క్రికెటర్లకు సముచిత గౌరవం ఇద్దామని పేర్కొన్నారు. ధోనీ విషయం టీమిండియా సెలెక్టర్లు, జట్టు అధికారులు చూసుకుంటారని, ఈ చర్చకు ఇంతటితో స్వస్తి పలుకుదామని అన్నారు.

  • Loading...

More Telugu News