Gutta jwala: ఎన్ కౌంటర్ ఒక్కటే పరిష్కారం కాదు : షట్లర్ గుత్తా జ్వాల

  • తప్పుజరగడానికి కారణాలను తెలుసుకోవాలి 
  • వీటితో అత్యాచారాలు ఆగిపోవు 
  •  పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది

దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో షట్లర్ గుత్తా జ్వాల కాస్త భిన్నంగా స్పందించారు. పోలీసుల చర్యను తప్పు అని ఆమె నేరుగా చెప్పకున్నా నిందితులను ఎన్‌కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? అని ఆమె ప్రశ్నించారు. అలాగైతే అత్యాచారం చేసిన నిందితులందరికీ 'ఎన్‌కౌంటర్'ను శిక్షగా మార్చాలని ఆమె కోరారు. 


దీనికంటే అసలు ఇటువంటి సంఘటనలకు కారణమవుతున్న అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన నిందితుల మానసిక స్థితి, ఎటువంటి పరిస్థితుల్లో చేశారు, ప్రేరేపించిన అంశాలను తెలుసుకోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా కొన్నిటినైనా ఆపవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

Gutta jwala
disa case
encounter
  • Loading...

More Telugu News