Hyderabad: తెలంగాణలో రూ. 170కి చేరిన కిలో ఉల్లి ధర!

  • హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంత ధర
  • నాసిరకం ఉల్లి సైతం కిలో రూ. 70
  • డిమాండ్ కు తగ్గ సరఫరా లేనందునేనంటున్న వ్యాపారులు

తెలంగాణలో ఉల్లి ధరలు మరింతగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర ఏకంగా రూ. 170 వరకూ వెళ్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ధర లేదు. హోల్ సేల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి ధర రూ. 145కు పెరిగింది. హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ చరిత్రలో క్వింటాలు ఉల్లికి రూ. 14,500 పలకడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.

ఇక రెండో రకం ఉల్లి రూ. 12,000, మూడో రకం ఉల్లి రూ. 8 వేలు, నాసిరకం ఉల్లి రూ. 7,000 వరకూ ధర పలుకుతోంది. రెండు కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో పాటు, డిమాండ్ కు తగ్గ సరఫరా లేనందునే ధరలు ఇంతగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Hyderabad
Onion
Market
Price Hike
  • Loading...

More Telugu News