Uttar Pradesh: యూపీ సీఎంను పాత పేరుతో పిలిచినందుకు ప్రతిపక్షనేతపై కేసు నమోదు

  • సమాజ్ వాదీ పార్టీ నేత ఐ.పీ.సింగ్ పై కేసు నమోదు
  • ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు
  • సనాతన ధర్మం, సాధు సంస్కృతిపై సింగ్ వ్యంగ్య వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను ఆయన పాత పేరుతో సంబోధించినందుకుగాను సమాజ్ వాదీ పార్టీ నేత ఐ.పి. సింగ్ పై కంటోన్మెంట్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. సనాతన ధర్మం, సాధు సంస్కృతి, సాధువుల జీవన విధానంపై తన ట్విట్టర్ ఖాతాలో ఐ.పీ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆయన పాతపేరు అజయ్ సింగ్ బిస్త్ గా సంబోధించారు. దీంతో కమలేశ్ చంద్ర త్రిపాఠి అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయమై తనకు పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం లేదని ఐ.పీ. సింగ్ పేర్కొన్నారు.

Uttar Pradesh
cm
Yogi Adityanath
sp
IP singh
  • Loading...

More Telugu News