Andhra Pradesh: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హా!

  • పలువురు అధికారులకు స్థానచలనం
  • ఐబీ చీఫ్ కుమార్ విశ్వజిత్ రిలీవ్
  • నెల్లూరు ఎస్పీగా భాస్కర్ భూషణ్

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం బుధవారం రాత్రి పలువురు అధికారులను బదలీ చేస్తున్నట్టు ప్రకటన వెలువరించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హాను నియమించారు. 2000 బ్యాచ్ కి చెందిన మనీశ్ కుమార్ నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నిఘా విభాగానికి కుమార్ విశ్వజిత్ చీఫ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్ను రిలీవ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే సమయంలో హోమ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహ్మద్ హసన్ రజాను జైళ్ల శాఖ డీజీగా బదలీ చేసింది. నెల్లూరు ఎస్పీగా విధుల్లో ఉన్న ఐశ్వర్య రస్తోగిని, డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ విభాగం ఏఐజీగా నియమిస్తూ, భాస్కర్ భూషణ్ ను నెల్లూరు ఎస్పీగా నియమించింది. ప్రస్తుతం ఏ విధమైన విధుల్లోనూ లేని టీఏ త్రిపాఠిని, సాధారణ పరిపాలనా శాఖకు పంపింది.

Andhra Pradesh
IPS
Transfers
  • Loading...

More Telugu News