Alia Bhat: ఆలియా భట్ కు నచ్చిన టాలీవుడ్ హీరో స్టయిల్!

  • ఇటీవల ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా
  • విజయ్ దేవరకొండ స్టయిల్ ఇష్టమని వెల్లడి
  • హీరోయిన్స్ లో అనుష్క బాగుంటుందని కితాబు

ఆలియా భట్... రాజమౌళి తీస్తున్న మల్టీ స్టారర్ 'ఆర్ఆర్ఆర్'తో తెలుగు తెరకు పరిచయం కానున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఆడిపాడనుందీ భామ. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా, మీడియాతో మాట్లాడుతున్న వేళ, మీకు ఏ హీరో స్టయిల్ నచ్చుతుందన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని 'బ్రహ్మాస్త్ర' సినిమాలో బిజీగా ఉన్న ఆలియా, హీరోయిన్స్ లో తనకు అనుష్క శర్మ స్టయిల్ ఇష్టమని, హీరోలలో విజయ్ దేవరకొండ స్టయిల్ ఎంతో సూపరని చెప్పింది.

Alia Bhat
Vijay Devarakonda
RRR
Rajamouli
Anushka Shetty
  • Loading...

More Telugu News