Nityananda Swamy: నిత్యానందస్వామి దేశానికి వీసా ఎలా తీసుకోవాలి?: అశ్విన్
- సొంత దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించిన నిత్యానంద
- విరాళాలు ఇవ్వడం ద్వారా పౌరసత్వం పొందవచ్చని ప్రకటన
- వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉందా అని ప్రశ్నించిన అశ్విన్
కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానంటూ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. కరీబియన్ దీవుల సమీపంలో ఓ చిన్న దీవిని కొన్న నిత్యానంద... ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా తన దీవిని పేర్కొన్నారు. ఆ దేశానికి ఒక జెండా, రాజ్యాంగం, అధికారం చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. తన దేశంలో ప్రధానితో పాటు చిన్నసైజు కేబినెట్ కూడా ఉందని చెప్పారు. విరాళాలను ఇవ్వడం ద్వారా తన దేశ పౌరసత్వాన్ని పొందవచ్చని తెలిపారు.
ఈ అంశంపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైరిక్ గా ట్వీట్ చేశారు. 'కైలాస దేశానికి వీసా పొందడానికి ప్రొసీజర్ ఏమిటి? వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉందా?' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.