Onion Prices hike: ఘాటెక్కిన ఉల్లి ధరలు.. కర్నూలు మార్కెట్ లో క్వింటాల్ కు రూ.12,510

  • రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాల్లో నిల్వలు నిల్
  • ధర ఎంతైనా కొనుగోలు చేయండని ప్రభుత్వం ఆదేశం
  • కొనుగోళ్లు జరపడంలో యార్డు అధికారులు, వ్యాపారుల మధ్య పోటాపోటీ

ఉల్లి ధరలు ఘాటెక్కి పోతున్నాయి. కిలో ఉల్లి పాయల ధర వంద రూపాయలు దాటింది. కర్నూలు మార్కెట్లో ఈ రోజు మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్ఠంగా రూ.12,510 పలికింది. వినియోగదారులకు రాయితీపై ఉల్లిని అందించేందుకు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో ఉల్లి నిల్వలు కరువయ్యాయి. కర్నూలు మార్కెట్ కు గతంలో రోజుకు 5వేల నుంచి 6వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది.

మరోవైపు ప్రజలకు రాయితీపై ఉల్లి సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించడంతో... మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి.

Onion Prices hike
Andhra Pradesh
  • Loading...

More Telugu News