KTR: రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదు: కేటీఆర్
- తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదు
- చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి
- ఎక్కువగా నాగ్ పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారు
- రక్షణ, వైమానిక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది
రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్ఐపాస్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదని, చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా నాగ్ పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. రక్షణ, వైమానిక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.
టీఎస్ఐపాస్ అనేది సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నామని, ఓఆర్ఆర్ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామని, ఇందు కోసం 10 వేల ఎకరాలు సేకరించామని చెప్పారు.