Crime News: 20 రోజుల క్రితమే ప్రేమ పెళ్లి.. అంతలోనే టెకీ అనుమానాస్పద మృతి!

  • ఇంట్లో శవమై కనిపించిన వివాహిత
  • భర్తే హత్యచేశాడంటున్న మృతురాలి కుటుంబం
  • పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన

ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. వివాహం జరిగి కేవలం 20 రోజులే అయింది. అంతలోనే ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో అంతుచిక్కడం లేదు. భర్తే హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు, ఆరోపిస్తున్నారు. 

పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ సనత్ నగర్ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె అన్నపూర్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమె తండ్రి కంపెనీలో పనిచేస్తున్న దాసరి కార్తీక్ ను ఆమె ప్రేమించింది. వీరి పెళ్లికి అన్నపూర్ణ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించిన అన్నపూర్ణ ప్రేమించిన వ్యక్తిని ఇరవై రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.

అనంతరం నూతన దంపతులు రామారావునగర్ లో కాపురం పెట్టారు. ఏమైందో ఏమో కానీ, నిన్న సాయంత్రం అన్నపూర్ణ చనిపోయింది. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. అన్నపూర్ణ కుటుంబ సభ్యులు మాత్రం భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్తీకే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Crime News
married women died
hyderabad
sanathnagar
  • Loading...

More Telugu News