chidambaram: జైలు నుంచి బయటకు రానున్న చిదంబరం ... బెయిల్ మంజూరు!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడు 
  • రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్
  • విదేశాలకు వెళ్లరాదని ఆదేశం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. రూ. 2 లక్షల పూచీకత్తుపై ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా కోరింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

సీబీఐ కేసులో ఇప్పటికే చిదంబరానికి బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాలను నాశనం చేయడానికి గానీ ప్రయత్నించరాదని హెచ్చరించింది. ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి వ్యాఖ్యలనూ చేయరాదని షరతు విధించింది.

chidambaram
ED
INX Media
Case
Bail
Supreme Court
  • Loading...

More Telugu News