Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • డ్రెస్ సెన్స్ పై కీర్తి సురేశ్ 
  • 25న 'ఇద్దరి లోకం ఒకటే'
  • శశికళ పాత్రలో ప్రియమణి

   *  తనకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది కథానాయిక కీర్తి సురేశ్. 'ఫ్యాషన్ డిజైనింగ్ మీద నాకు మొదటి నుంచీ అవగాహన వుంది. అందుకే నా సినిమాలలో వస్త్రధారణ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాను. నా డ్రెస్ సెన్స్ బాగుంటుందని అందరూ అంటుంటారు. దానికి కారణం, దాని మీద నాకున్న అవగాహనే" అని చెప్పింది కీర్తి.
*  రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షాలినీ పాండే కథానాయికగా నటించింది.  
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 'తలైవి' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి నటించనుంది. 

Keerthi Suresh
Rajtarun
Dil Raju
Kangana Ranouth
  • Loading...

More Telugu News