Attrocities on Women: మహిళా ఆర్ట్ డైరెక్టర్ పట్ల యువకుల అసభ్య ప్రవర్తన

  • అసభ్యంగా తిడుతూ.. దుస్తులు చింపడానికి ప్రయత్నించిన దుండగులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • బంజారా హిల్స్ లో చోటుచేసుకున్న ఘటన

మహిళలపై  జరుగుతున్న దుర్మార్గాలపై దేశమంతా నిరసన వ్యక్తమవుతోన్నప్పటికీ.. మళ్లీ మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది.

హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో తాను ప్రయాణిస్తున్న కారును మరోకారు ఢీకొట్టిందని ఆమె చెప్పారు. ఇదేమిటని అడిగితే ఢీ కొట్టిన కారులో ఉన్న మహిళలు, యువకులు కలిసి అసభ్య పదజాలంతో తిడుతూ.. తనపై దాడికి దిగారని పోలీసులకు తెలిపారు. తన దుస్తులు కూడా చింపడానికి ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Attrocities on Women
Hyderabad
Banjara hills
women alleged that some guys abused and torn her clothes publicly
  • Loading...

More Telugu News