jail: మాంసాహారం కావాలి.. ఐపాడ్ కూడా కావాలి: జైలులో గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ కోరికలు

  • ఎఫ్‌ఎం రేడియో, ఇంటి భోజనం కూడా కావాలని వినతి
  • బరువు తగ్గిపోతున్నానని వ్యాఖ్య
  • నో చెప్పిన అధికారులు

నేరాలకు పాల్పడి ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ అతగాడి కోరికలకు హద్దుల్లేకుండా పోతున్నాయి. తనకు ఐపాడ్‌తో పాటు ఎఫ్‌ఎం రేడియో, ఇంటి భోజనం, మాంసాహారం కావాలంటూ జైలు అధికారులకు కోర్టు ద్వారా వినతి పత్రం ఇచ్చాడు. అప్పట్లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ అయిన నీరజ్‌ బవానా తీరు ఇది. 2015, ఏప్రిల్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

తనకు జైల్లో బోర్ కొడుతోందని నీరజ్ అంటున్నాడు. మాంసాహారినైన తనకు జైలులో శాకాహారం మాత్రమే ఇస్తున్నారని దీంతో బరువు తగ్గిపోతున్నానని చెప్పాడు. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు.. అతడి కోరికలు జైలు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. తిహార్‌ జైలులో కేవలం శాకాహారం మాత్రమే ఇస్తామన్నారు. ఇప్పటికే జైలులో రేడియో ఉందని, దానిలోనే అతడు పాటలు వినవచ్చని అన్నారు. కాగా, దావూద్‌ ఇబ్రహీంను ఆదర్శంగా తీసుకుని నీరజ్ గతంలో నేరాలకు పాల్పడ్డాడు.

  • Loading...

More Telugu News