Hyderabad: హైదరాబాద్‌లో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రాఫిక్‌కు అంతరాయం

  • నడిరోడ్డులో వాహనంపై పడుకున్న కానిస్టేబుల్
  • అడిగినందుకు నానా రభస
  • సస్పెండ్ చేసిన కమిషనర్

పూటుగా తాగిన ఓ కానిస్టేబుల్ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. ఇదేం పనంటూ ప్రశ్నించిన వాహనదారులపై గొడవకు దిగాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో జరిగిందీ ఘటన. మద్యం తాగిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య నడిరోడ్డుపై ఓ వాహనానికి ఆనుకుని పడుకున్నాడు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పక్కకి జరగమన్న వాహనదారులపై విరుచుకుపడి నానా హంగామా చేశాడు. చివరికి ఎలాగోలా అతడిని రోడ్డు పక్కకి పంపించారు. విషయం తెలిసిన కమిషనర్ అంజనీకుమార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేశారు. నడిరోడ్డుపై అంత జరుగుతున్నా  పట్టించుకోని ఫలక్‌నుమా సీఐకి మెమో జారీ చేశారు.

Hyderabad
Falaknuma
constable
  • Loading...

More Telugu News