ananthakumar hegde: అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలు నిజమే అయితే.. మోదీ రాజీనామా చేయాల్సిందే: ఎన్సీపీ డిమాండ్

  • రూ. 40 వేల కోట్ల కేంద్ర నిధులను ఫడ్నవీస్ తిప్పి పంపారన్న హెగ్డే
  • ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలన్న నవాబ్ మాలిక్
  • దీనిని ఇతర రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలన్న ఎన్సీపీ

కేంద్ర నిధులను ఫడ్నవీస్ వెనక్కి తిప్పి పంపారంటూ బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే, ప్రధాని నరేంద్రమోదీ తన పదవికి రాజీనామా చేయాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ. 40 వేల కోట్లు తిప్పి పంపడం అసాధ్యమని, అదే కనుక నిజమైతే మోదీ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. ఇది ఒక్క మహారాష్ట్రకే జరిగిన అన్యాయం కాదన్న నవాబ్ మాలిక్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాలు కూడా ఇలాంటి వాటిని సహించకూడదన్నారు.

ananthakumar hegde
BJP
Maharashtra
Fadnavis
nawab malik
  • Loading...

More Telugu News