biodiversity: 'బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌' ప్రమాద ఘటన.. ఆసుపత్రి నుంచి నేడు మిలన్ కృష్ణారావు డిశ్చార్జి

  • గత నెలలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం
  • కారుతో సహా కిందపడిన మిలన్ కృష్ణారావు
  • ఆరోగ్యం కుదుటపడ్డాక అదుపులోకి తీసుకుంటామన్న పోలీసులు

హైదరాబాద్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి మితిమీరిన వేగంతో వెళ్లి కారుతో సహా కిందపడి, మహిళ మృతికి కారణమైన మిలన్ కృష్ణారావు నేడు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన కుబ్రాకు మరో పది రోజుల పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. మిలన్ కృష్ణారావు ఆరోగ్యం కుదుటపడిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.  

గత నెలలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

biodiversity
Gachibowli
milan krishna rao
  • Loading...

More Telugu News