Karnataka: మూఢనమ్మకంతో ఏడు రోజుల పసికందు హత్య

  • కొడుకుకు ఇబ్బంది అని ఓ తల్లి ఘోరం
  • జ్యోతిష్కుడి మాటలు నమ్మిన నాయనమ్మ
  • మహానగరం బెంగళూరులో ఘటన

మూఢనమ్మకంతో నాయనమ్మే దారుణానికి ఒడిగట్టింది. ఏడు రోజులు కూడా నిండని పసికందు గొంతునులిమి చంపేసింది. కొడుకు పుట్టకపోతే నీ కొడుకుకు ఇబ్బంది తప్పదని ఓ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఆమెతో ఈ దారుణానికి ఒడిగట్టేలా చేశాయి. ఏదో మారుమూల గ్రామంలో ఇది జరిగిందనుకుంటే పొరపాటు. మహానగరం బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకోవడం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేసింది. 


వివరాల్లోకి వెళితే...నగరానికి చెందిన నమ్మిన పరమేశ్వరి (60) కొడుకు తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా తమిళ్ సెల్వి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 'నూతన దంపతులకు కొడుకు పుట్టకపోతే నీ కొడుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాడు' అంటూ ఓ జ్యోతిష్కుడు పరమేశ్వరికి తెలిపాడు. వీరికి ఇటీవల ఓ పాప పుట్టింది. దీంతో జ్యోతిష్కుడి మాటలు గుర్తుకు వచ్చిన పరమేశ్వరి మనవరాలి గొంతునులిమి చంపేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసింది. కాగా, కోడలిపై కక్ష పెంచుకున్న పరమేశ్వరి కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని పోలీసులు భావిస్తున్నారు.

Karnataka
benglur
7 days chaild mirdered
grandmam accused
  • Loading...

More Telugu News