Chaina: చైనాలో సెల్ సిమ్ తీసుకోవడం అంత ఈజీ కాదు!
- నిన్నటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి
- ముఖం మొత్తం స్కాన్ చేశాకే పరిశీలన
- ఫోన్ రిజిస్ట్రేషన్లో కూడా అసలు పేరునే వాడాలి
సెల్ ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం బఠానీలు కొన్నంత ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఆధార్ కార్డు నంబర్‌లో సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తే బయోమెట్రిక్ స్కాన్ అనంతరం అవసరమైన రుసుం చెల్లిస్తే చాలా సంస్థలు సిమ్ కార్డు జారీ చేస్తున్నాయి. దీంతో దుర్వినియోగం కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా ఆర్థిక మోసాలు, ఉగ్ర కార్యకలాపాల్లో సిమ్ కార్డుల దుర్వినియోగం అధికంగా ఉంది.
ఈ పరిస్థితులన్నింటినీ అవలోకించిన చైనా నిన్నటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి ముఖాన్ని, కళ్లను పూర్తిగా స్కాన్ చేసిన తర్వాతే సిమ్ కార్డు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడే వారు తమ అసలు పేరునే రిజిస్ట్రేషన్లో వాడాలని సెప్టెంబర్ లోనే నిబంధన విధించిన చైనా తాజాగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.