: మంద కృష్ణకు గుండెపోటు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గుండెపోటుకు గురయ్యారు. నల్గొండ పర్యటనలో ఉన్న ఆయనకు ఈ ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేసిన వైద్యులు అక్కడి నుంచి హైదరాబాదు తీసుకువెళ్లాలంటూ సూచించారు. దాంతో కార్యకర్తలు ఆయన్ని హైదరాబాదుకు తరలిస్తున్నారు.